TSLPRB SI Prelims Exam 2022: ఎస్ఐ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షకు ముందు ఇవి తప్పక తెలుసుకోండి..!
TSLPRB SI Exam 2022: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(TSLPRB) కింద చేపడుతున్న ఎస్ఐ ఉద్యోగాలకు ఆదివారం నాడు ప్రాథమిక..
TSLPRB SI Exam 2022: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(TSLPRB) కింద చేపడుతున్న ఎస్ఐ ఉద్యోగాలకు ఆదివారం నాడు ప్రాథమిక పరీక్ష జరుగనుంది. ఈ ఎగ్జామ్ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అయితే, పరీక్ష నేపథ్యంలో అభ్యర్థులకు కీలక సూచనలు, సలహాలు చేసింది టీఎస్ఎల్‌పిఆర్‌బి. ఈ పరీక్ష కోసం లక్షలాది మంది అభ్యర్థులు సన్నద్ధమవుతుండగా.. వీరిలో తొలిసారి పరీక్ష రాసేవారు చాలా మంది ఉన్నారు. వీరికి పరీక్ష పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు పరీక్ష పట్ల అవగాహన కల్పిస్తూ.. పోలీస్ శాఖ కీలక సూచనలు, సలహాలతో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎస్ఐ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తెలుసుకోవాల్సిన కీలక సమాచారం ఇదే.. 1. ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. 2. పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా తమ వెంట హాల్ టికెట్ తీసుకురావాలి. 3. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్‌పై తప్పనిసరిగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ను అతికించాలి. లేని పక్షంలో పరీక్షకు హాజరు కావడానికి అనుమతించబడరు. 4. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి తేదీ 07-08-2022 ఉదయం 9 గంటల వరకు చేరుకోవాలి. 5. పరీక్షా సమయం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు నిర్వహించబడుతుంది. 6. ఉదయం 10:00 గంటల తర్వాత పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించరు. 7. పరీక్షలో 200 మార్కుల 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి 0.20 మార్కులు కోత విధిస్తారు. 8. బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచీలు, కాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. 9. ఓఎంఆర్ షీట్లలో వైట్‌నర్‌ను ఉపయోగించకూడదు. 10. ప్రాథమిక పరీక్ష కోసం బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు చేయబడుతుంది. కావున.. బయోమెట్రిక్ సిబ్బంది సహాయం చేయవచ్చు. 11. అభ్యర్థులు వారి గది నంబర్, సంబంధిత సీటుకు చేరుకోవాలి. ప్రశ్నపత్రం కోడ్‌ను చెక్ చేసుకోవాలి. 12. పరీక్షకు సంబంధించిన అన్ని OMR షీట్లను తీసుకున్న తర్వాత, అభ్యర్థులందరినీ ఒకేసారి బయటకు పంపుతారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..