PNB Recruitment: బీటెక్ అర్హతతో బ్యాంక్ ఉద్యోగం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఆఫీసర్, మేనేజర్ పోస్టులు..
PNB Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో మేనేజర్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయన్నారు...
PNB Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో మేనేజర్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయన్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఆఫీసర్ (ఫైర్- సేఫ్టీ)(జేఎంజీఎస్-1 గ్రేడ్) (23), మేనేజర్ (సెక్యూరిటీ)(ఎంఎంజీఎస్-2 గ్రేడ్) (80) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ, బీఈ(ఫైర్), బీఈ, బీటెక్(ఫైర్ టెక్నాలజీ/ ఫైర్ ఇంజినీరింగ్/ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను చీఫ్ మేనేజర్ (రిక్రూట్‌మెంట్ విభాగం), హెచ్‌ఆర్‌డీ డివిజన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేట్ ఆఫీస్, ప్లాట్ నెం.4, సెక్టార్ 10, ద్వారక, న్యూదిల్లీ చిరునామాకు స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత/ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.59, మిగతా అభ్యర్థులు రూ.1003 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 30-08-2022ని నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
* మరిన్ని విద్య ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..