Teaching Jobs: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్ట్‌లు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

Teaching Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ పాడేరు పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

Teaching Jobs: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్ట్‌లు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Follow us

|

Updated on: Aug 06, 2022 | 5:04 PM

Teaching Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ పాడేరు పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకుగాను ఏపీ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 88 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు (28), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (60) ఖాళీలు ఉన్నాయి.

* పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్టుల్లో భాగంగా ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, పొటిటికల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టులు.. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్‌లకు గాను ఇంగ్లిష్, హిందీ, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈడీ, సీటెక్‌, ఎస్‌టెట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను ఈమెయిల్‌ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అకడమిక్ క్వాలిఫికేషన్ మార్కులు, సీటీఈటీ, టెట్ మార్కులు, అదనపు అర్హతలు, పని అనుభవం, ఇంగ్లిష్ మీడియం చదువు, డెమో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 45,000, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్‌లకు నెలకు రూ. 47,000 చెల్లిస్తారు.

* దరఖాస్తులను recruitmentemrs@gmail.com మెయిల్ ఐడీకి పంపించాలి.

* దరఖాస్తుల స్వీకరణ 13-08-2022 తేదీతో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..