TS Police SI Answer Key 2023: తెలంగాణ ఎస్‌ఐ తుది రాత పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. అభ్యంతరాల స్వీకరణకు రేపే ఆఖరు

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్ష ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సై తుది రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు..

TS Police SI Answer Key 2023: తెలంగాణ ఎస్‌ఐ తుది రాత పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల.. అభ్యంతరాల స్వీకరణకు రేపే ఆఖరు
TS Police SI Answer Key 2023

Updated on: Apr 16, 2023 | 1:04 PM

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్ష ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సై తుది రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ని తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) తాజాగా విడుదల చేసింది. అర్థమెటిక్‌ అండ్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ లేదా మెంటల్‌ ఎబిలిటీ, ఆంగ్లభాష, జనరల్‌ స్టడీస్‌, తెలుగు లేదా ఉర్దూభాషకు సంబంధించిన సబ్జెక్టు పరీక్షల కీని మండలి వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు.

ఆన్సర్‌ కీపై అభ్యంతరాలుంటే ప్రతి ప్రశ్నకు ప్రత్యేక ప్రొఫార్మాలో ఆన్‌లైన్‌ విధానంలోనే నమోదు చేయాలని మండలి ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు సూచించారు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను కూడా ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.