TS TET 2022 Result Date: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) ఆదివారం (జూన్ 12)న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు 90 శాతం మందికిపైగా అభ్యర్ధులు హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకోలేదని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. మొత్తం 6,29,382 మంది తెలంగాణ టెట్‌కు దరఖాస్తు చేసుకోగా..5,69,576ల మంది హాజరయ్యారు. పేపర్ 1 పరీక్షకు బీఎడ్ అభ్యర్ధులను కూడా అనుమతించడంతో 3,51,482ల మంది దరఖాస్తు చేసుకోగా.. 3,18,506ల మంది హాజరయ్యారు. అంటే దాదాపు 90.62 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక రెండో పేపర్‌కు 2,77,900ల మంది దరఖాస్తు చేసుకోగా 2,51,050ల మంది పరీక్ష రాశారు. పటిష్టమైన భద్రాతా ఏర్పాట్లతో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా టెట్ పరీక్ష ఫలితాలను జూన్ 27న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ రాధారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.