TS Polycet 2023: మే 17న తెలంగాణ పాలీసెట్-2023 పరీక్ష.. హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికిగానూ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్‌-2023 పరీక్ష బుధవారం (మే 17న) జరగనుంది. మొత్తం 296 పరీక్ష కేంద్రాల్లో ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల వ‌ర‌కు ప్రవేశ ప‌రీక్ష..

TS Polycet 2023: మే 17న తెలంగాణ పాలీసెట్-2023 పరీక్ష.. హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
TS Polycet 2023

Updated on: May 15, 2023 | 8:02 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికిగానూ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్‌-2023 పరీక్ష బుధవారం (మే 17న) జరగనుంది. మొత్తం 296 పరీక్ష కేంద్రాల్లో ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల వ‌ర‌కు ప్రవేశ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. మొత్తంగా 1,05,656 మంది ఈ ప‌రీక్షకు హాజ‌రు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అబ్బాయిలు 58,468 మంది, అమ్మాయిలు 47,188 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. హాల్‌ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ లో డైన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ప్రవేశ ప‌రీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్యవ‌సాయ‌, ఉద్యాన‌వ‌న, వెట‌ర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తారు.

పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్టుకు హాజ‌ర‌య్యే విద్యార్థులు ఒక గంట ముందుగానే ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని, నిమిషం ఆల‌స్యమైనా ప‌రీక్షా కేంద్రంలోకి అనుమ‌తించబోమని పరీక్ష కన్వీనర్‌ డాక్టర్‌ సి శ్రీనాథ్‌ స్పష్టం చేశారు. విద్యార్థులు త‌మ హాల్ టికెట్‌తోపాటు ఒక పాస్‌పోర్టు సైజు ఫోటోను వెంట తీసుకువెళ్లాలని సూచించారు. వెంట హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పెన్, రబ్బర్‌ మాత్రమే తీసుకువెళ్లాలని, ఎలక్ట్రిక్‌ వస్తువులను లోపలికి అనుమతించమని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us