TS Eamcet 2022: జులై 14 నుంచి తెలంగాణ ఎంసెట్‌-2022 పరీక్షలు

|

Jul 06, 2022 | 7:23 AM

తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS EAMCET 2022) ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఎంసెట్‌ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు..

TS Eamcet 2022: జులై 14 నుంచి తెలంగాణ ఎంసెట్‌-2022 పరీక్షలు
Ts Eamcet 2022
Follow us on

TS EAMCET 2022 Exam Dates: తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS EAMCET 2022) ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఎంసెట్‌ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు జులై 14, 15 తేదీల్లో జరగనున్నాయి. ఇంజనీరింగ్ పరీక్షలు జూలై 18, 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాల్లో జరుగనున్నాయి. దాదాపు 2.66 లక్షల మంది విద్యార్ధులు ఈ ఏడాది ఎంసెట్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. దీంతో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్న ఎంసెట్‌ పరీక్షలకు తెలంగాణలో 85, ఆంధ్రప్రదేశ్‌లో 24 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. గతేడాది కంటే ఈ సారి 5 పరీక్ష కేంద్రాలను పెంచినట్లు తెలుస్తోంది. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం సెషన్‌ పరీక్ష 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగనుంది.

కాగా ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేసిన విషయం తెలిసిందే. పాత నిబంధనల ప్రకారం జనరల్‌ విద్యార్ధులు ఇంటర్‌లో 45 శాతం, మిగిలిన వారు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందటం తప్పనిసరిగా ఉంది. అంతేకాకుండా ఈ సారి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ (25% weightage) కూడా ఉండదు. అంటే ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంక్‌ కేటాయిస్తారన్నమాట. 70 శాతం సిలబస్‌తోనే ఎంసెట్‌లో ప్రశ్నలను రూపొందిచాలని నిర్ణయించారు. 160 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 160 మార్కుల చొప్పున పశ్నాపత్రం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ఇప్పటికే హాల్‌ టికెట్లుకూడా విడుదలయ్యాయి. పరీక్ష నిర్వహణకు రెండు, మూడు రోజుల్లో అన్ని ఏర్పటు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.