TG DSC 2024 Exam Dates: డీఎస్సీ పరీక్షల తేదీలపై వీడని సందిగ్ధత.. వాయిదా వేయాలంటూ అభ్యర్ధుల విన్నపాలు!

|

Jun 27, 2024 | 5:26 PM

తెలుగు రాష్ట్రాల్లో మెగా డీఎస్సీలు ప్రస్తుతం చర్చణీయాంశాలుగా నిలిచాయి. ఈ నెలాఖరుకు ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలవనుండగా.. ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ ప్రకటన వచ్చేసింది. దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తి చేసింది. మొత్తం 11,062 పోస్టుల భర్తీకిగానూ 2,79,956 దరఖాస్తులు అందినట్లు విద్యాశాఖ తెలిపింది. ఇక జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని నాలుగు నెలల క్రితమే విద్యాశాఖ వెల్లడించినా..

TG DSC 2024 Exam Dates: డీఎస్సీ పరీక్షల తేదీలపై వీడని సందిగ్ధత.. వాయిదా వేయాలంటూ అభ్యర్ధుల విన్నపాలు!
TG DSC 2024 Exam Dates
Follow us on

హైదరాబాద్‌, జూన్‌ 27: తెలుగు రాష్ట్రాల్లో మెగా డీఎస్సీలు ప్రస్తుతం చర్చణీయాంశాలుగా నిలిచాయి. ఈ నెలాఖరుకు ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలవనుండగా.. ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ ప్రకటన వచ్చేసింది. దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తి చేసింది. మొత్తం 11,062 పోస్టుల భర్తీకిగానూ 2,79,956 దరఖాస్తులు అందినట్లు విద్యాశాఖ తెలిపింది. ఇక జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని నాలుగు నెలల క్రితమే విద్యాశాఖ వెల్లడించినా.. ఇంత వరకు పరీక్షల పూర్తి షెడ్యూల్‌ రాకపోవడంపై అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. తాత్కాలిక షెడ్యూలును గత ఫిబ్రవరిలోనే విద్యాశాఖ ప్రకటించినా.. తుది తేదీలు ఎప్పుడు ప్రకటిస్తుందోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల కొత్తగా టెట్‌ ఉత్తీర్ణులైనవారు.. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం కావాలని, కొంతకాలంపాటు డీఎస్సీ వాయిదా వేయాలంటూ కోరుతున్నారు. ఆగస్టు 15 తర్వాత డీఎస్సీ నిర్వహించాలంటూ డీఎస్సీ హెల్ప్‌లైన్‌ డెస్క్‌కు విజ్ఞప్తులు వెళ్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాగా మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 28న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జూన్‌ 20వ తేదీతో ముగియగా.. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. సుమారు 2 లక్షల వరకు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకుని ఉంటారని విద్యాశాఖ అంచనా వేస్తుంది. జులై 17 నుంచి 31 మధ్య నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో విద్యాశాఖ పేర్కొన్నప్పటికీ.. అది తాత్కాలిక షెడ్యూలుగా తెలిపింది. అంటే ఇవే తేదీల్లో పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తారని లెక్కకాదు. ఇకకొత్తగా జరిపిన టెట్‌ పరీక్ష ఫలితాలు జూన్‌ 12న వెలువడ్డాయి. పరీక్షల తేదీలు సమీపిస్తున్నా డీఎస్సీకి సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూలును అధికారులు ఇంకా వెల్లడించలేదు. మరోవైపు టెట్‌లో కొత్తగా పాసైనవారు తాము డీఎస్సీకి సన్నద్ధం అయ్యేందుకుగాను కనీసం నెల రోజులపాటు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జులై 17 నుంచి పరీక్షలు ప్రారంభమైతే అభ్యర్థులు సన్నద్ధమవడానికి కేవలం 20 రోజులు మాత్రమే మిగులున్నాయి. ఇప్పటివరకు సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలు ప్రకటించలేదు. టెట్‌ ఫలితాలు విడుదల చేసిన రోజే పూర్తి షెడ్యూలు వెలువరించి ఉంటే గందరగోళం తలెత్తేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఉపాధ్యాయుల పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలిపి భర్తీ చేయాలని అభ్యర్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2, 3 రోజుల్లోనే విద్యాశాఖ పరీక్షల తేదీలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షల వాయిదా ఉండదని, ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. ఒకవేళ డీఎస్సీ వాయిదా వేస్తే మళ్లీ 10, 15 రోజుల వరకు ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణకు స్లాట్లు దొరకటం కష్టమవుతుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్త కథనాల కోసం క్లిక్‌ చేయండి.