హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్ధులకు అలర్ట్. పదో తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 30 (మంగళవారం)వ తేదీన ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో సెక్రటరీ బుర్రా వెంకటేశం టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటన కూడా వెలువరించింది. టెన్త్ ఫలితాల ప్రకటన అనంతరం టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను నేరుగా ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోవచ్చు.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 2,676 పరీక్ష కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షలకు మందికి పైగా విద్యార్ధులు హాజరయ్యారు. ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే మూల్యాంకన ప్రక్రియ కూడా ప్రారంభించగా.. ఏప్రిల్ 20 నాటికి మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తి చేశారు. పది రోజుల్లో రోజుల్లో డీ కోడిండ్ ప్రక్రియ పూర్తి చేసిన బోర్డు.. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగారాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు.
మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను ముందుగానే నిర్వహించి, మూల్యాంకనం కూడా త్వరితగతిగానే పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇంటర్, టెన్త్ పరీక్షల ఫలితాలు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలోనూ ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన విద్యాశాఖ మంగళవారం పదో తరగతి ఫలితాలను కూడా ప్రకటించనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.