TS Gurukula Hall tickets: ‘గురుకుల’ ఉపాధ్యాయ పోస్టులకు హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. కానీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

|

Jul 26, 2023 | 12:48 PM

లంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఆన్‌లైన్‌ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గురుకుల బోర్డు..

TS Gurukula Hall tickets: గురుకుల’ ఉపాధ్యాయ పోస్టులకు హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. కానీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు
TS Gurukula Hall tickets
Follow us on

హైదరాబాద్‌, జులై 26: తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఆన్‌లైన్‌ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గురుకుల బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తమ వివరాలతో లాగిన్‌ అయ్యి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన సబ్జెక్టుల పోస్టుల వారీగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవల్సి ఉంటుంది.

పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

తొలుత ఆగస్టు 1 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు నియామక బోర్డు ప్రకటించినప్పటికీ తాజాగా ఆగస్టు 23 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పరీక్ష షెడ్యూలులో గురుకుల నియామక బోర్డు స్వల్ప మార్పులు చేసింది. కొన్ని విడతల్లోని సబ్జెక్టులను ఇతర విడతలకు బదిలీ చేయడం వల్లనే ఈ మార్పు సంభవించినట్లు స్పష్టం చేసింది. పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ప్రతిరోజూ ఆయా తేదీల్లో 3 షిప్టుల్లో పరీక్షలు ఉంటాయి.

మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉంటుంది. రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు, మూడో షిఫ్టు పరీక్ష సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.