హైదరాబాద్, జనవరి 2: సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయడంపై న్యాయస్థానం నుంచి స్పష్టత రాగానే మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో జాబితాను ప్రకటించనుంది. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, తుది జాబితాల వెల్లడికి కనీసం మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విద్యాసంవత్సరం ముగిసేలోగా నియామకాలు పూర్తిచేసి, పోస్టింగులు ఇవ్వాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. హైకోర్టు నుంచి స్పష్టత రాగానే తొలుత డిగ్రీ, తర్వాత జూనియర్ లెక్చరర్లు, పీజీటీ పోస్టులకు 1:2 నిష్పత్తిలో జాబితాలు ప్రకటించనున్నారు. ధ్రువ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే.
కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ద్వితీయ, తృతీయ, 5వ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు జనవరి 17 వరకు అని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్, సేఫ్టీ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ వెంకట్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్, ఫైర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, సబ్ ఫైర్ ఆఫీసర్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు జనవరి 10వ తేదీలోపు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. పూర్తి వివరాలకు 97014 96748 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.