Job Mela Hyderabad: ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా.? అయితే మీకు ఇది శుభవార్త. హైదరాబాద్‌లో నేడు (శనివారం) భారీ జాబ్ మేళా జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభంకానుంది. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, ఒమెగా మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల కార్యదర్శి ఎస్. సతీరాంరెడ్డి తెలిపారు.
హైదరాబాద్ ఈసీఐఎల్‌లోని రాధికా చౌరస్తాలోని ఒమెగా డిగ్రీ కళాశాలలో ఈ జాబ్‌మేళ నిర్వహిస్తారు. ఈ జాబ్‌మేళాలో టెక్‌మహేంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, విజయా డయాగ్నసిస్, డిజిటల్ ఫ్లెక్స్, విప్రో, ప్లిప్‌కార్డు, సోల్ ఆఫ్ ప్లూటో, టెలిఫర్పామెన్స్, ఆక్సెంచర్, ఐఐఎఫ్‌ఎల్, బైజూస్ వంటి టాప్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ జాబ్‌మేళాకు 2018 నుంచి 2021 వరకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు హాజరు కావొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకోసం 6281979800, 7729824005, 9550078555, 7680820584 నెంబర్లకు సంప్రదించాలని సీతారాంరెడ్డి కోరారు.
Low CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ పొందడం ఎలా..? రుణంకు స్కోర్‌కు సంబంధం ఏమిటి..?
UPSC Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.