TMC Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

టాటా మెమోరియల్ సెంటర్‌ (TMC Varanasi)కి చెందిన వారణాసిలోని హోమీ భాభా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ మహామాన పండిట్ మదన్‌మోహన్ మాల్వియ క్యాన్సర్ సెంటర్‌లలో.. ప్రొఫెసర్ రేడియో డయాగ్నోసిస్-జి, ప్రొఫెసర్-ఎఫ్ (మెడికల్‌ అంకాలజీ)..

TMC Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Tmc
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 10, 2022 | 7:12 AM

TMC Varanasi Professor Recruitment 2022: టాటా మెమోరియల్ సెంటర్‌ (TMC Varanasi)కి చెందిన వారణాసిలోని హోమీ భాభా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ మహామాన పండిట్ మదన్‌మోహన్ మాల్వియ క్యాన్సర్ సెంటర్‌లలో.. 6 ప్రొఫెసర్ రేడియో డయాగ్నోసిస్-జి, ప్రొఫెసర్-ఎఫ్ (మెడికల్‌ అంకాలజీ), అసిస్టెంట్ ప్రొఫెసర్-ఇ (సర్జికల్ ఆంకాలజీ), అసిస్టెంట్ ప్రొఫెసర్-ఇ (న్యూక్లియర్ మెడిసిన్), మెడికల్ ఆఫీసర్-సి (ఉమెన్‌ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్‌ ప్రివెంటివ్‌ కేర్‌) పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎం, ఎంసీహెచ్‌, డీఎన్‌బీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 45 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి. సంబంధిత స్పెషలేజేషన్‌లో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. తుది ఎంపిక ఫలితాలు అక్టోబర్‌ 3, 2022వ తేదీన ప్రకటిస్తారు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.300లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,100ల నుంచి రూ.1,31,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.