TS Polytechnic: పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాల లీక్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్.. పరీక్షలను రద్దు చేస్తూ..
TS Polytechnic: తెలంగాణ పాలిటెక్నిక్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ కావడంతో రెండు పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం..
TS Polytechnic: తెలంగాణ పాలిటెక్నిక్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ కావడంతో రెండు పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం తిరిగి 15, 16 తేదీల్లో తిరిగి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో పాలిటెక్నిక్ పరీక్షలు ఈనెల 8వ తేదీన మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పరీక్షలు జరిగాయి.
అయితే రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో ఉన్న స్వాతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు బోర్డుకు సమాచారం తెలిసింది. దీంతో ప్రశ్నాపత్రాల లీక్‌ను గుర్తించిన ఇతర జిల్లాల్లోని ప్రిన్సిపల్స్ బోర్డుకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌లో లీక్ అయినట్లు గుర్తించారు. ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు.