AP EDCET counselling 2021: ఏపీ ఎడ్‌ సెట్‌ 2021 రెండో దశ షెడ్యూల్‌ విడుదల.. షెడ్యూల్‌ ఇదే!

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EDCET 2021) ఫేజ్‌ 2 కౌన్సెలింగ్ తేదీలను APSCHE విడుదల చేసింది..

AP EDCET counselling 2021: ఏపీ ఎడ్‌ సెట్‌ 2021 రెండో దశ షెడ్యూల్‌ విడుదల.. షెడ్యూల్‌ ఇదే!
Ap Edcet Counselling
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 11, 2022 | 6:36 PM

AP EDCET counselling 2021 dates: ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EDCET 2021) ఫేజ్‌ 2 కౌన్సెలింగ్ తేదీలను APSCHE విడుదల చేసింది. తాజా కౌన్సెలింగ్ తేదీల ప్రకారం.. ఫేజ్-2 రిజిస్ట్రేషన్లు ఈరోజు (ఫిబ్రవరి 11) నుండి ప్రారంభమయ్యి రేపటితో(ఫిబ్రవరి 12) ముగియనున్నట్టు దరఖాస్తుదారులకు సూచించింది. దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ edcet-sche.aptonline.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు. ఏపీ ఎడ్‌సెట్‌ రెండో దశ కౌన్సెలింగ్ 2021కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవల్సు ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీజు ఓసీ/బీసీ అభ్యర్ధులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్ధులకు రూ. 600 ఉంటుంది. ఇతర ముఖ్య సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిచండి.

రెండో దశ హెడ్యూల్‌ ఇదే..

  • రిజిస్ట్రేషన్‌ తేదీలు: ఫిబ్రవరి 11, 12 తేదీలు
  • సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌: ఫిబ్రవరి 12, 13 తేదీలు
  • వెబ్‌ ఆప్షన్లు: ఫిబ్రవరి 13, 14 తేదీలు
  • వెబ్‌ ఆప్షన్లలో మార్పులు: ఫిబ్రవరి 15
  • 2 ఫేస్‌ సీట్ల కేటాయింపు: ఫిబ్రవరి 17
  • కాలేజ్‌ రిపోర్టింగ్: ఫిబ్రవరి 18

Also Read:

Promise Day 2022: ఈ ప్రామిస్‌లు చేశారంటే మీ బంధం ఎక్కువ రోజులు నిలువదు! వీటితో జాగ్రత్త..