వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023లో భారత్‌కు చుక్కెదురు.. టాప్ 300లో ఒకే ఒక విశ్వవిద్యాలయానికి దక్కిన చోటు..

|

Oct 13, 2022 | 4:19 PM

Times World University Ranking: THE ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2023లో, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం గ్లోబల్ ర్యాంకింగ్‌లలో వరుసగా ఏడవ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం 104 దేశాలు, భూభాగాల్లోని 1,799 విశ్వవిద్యాలయాలకు ఇందులో ర్యాంకింగ్స్ అందించారు.

వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023లో భారత్‌కు చుక్కెదురు.. టాప్ 300లో ఒకే ఒక విశ్వవిద్యాలయానికి దక్కిన చోటు..
Indian Institute Of Science
Follow us on

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023’లో టాప్ 300 జాబితాలో చోటు దక్కించుకుంది. IISc బెంగళూరు THEE ఈ ర్యాంకింగ్‌లో మెరుగుదల చూపించింది. గతేడాది 301- 350 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023లో మొత్తం 75 భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. అదే సమయంలో, IIT ఢిల్లీతో సహా అనేక ప్రముఖ IITలు వరుసగా మూడవ సంవత్సరం ఇందులో చోటు దక్కించుకోలేకపోయాయి. విశ్వవిద్యాలయాల సంఖ్యలో భారత్ 6వ స్థానంలో నిలిచింది. గతేడాది 601-800 కేటగిరీలో నిలిచిన కొట్టాయంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ.. తాజా ఫలితాల్లో 401-500 కేటగిరీలో నిలిచింది.

THE ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2023లో, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం గ్లోబల్ ర్యాంకింగ్‌లలో వరుసగా ఏడవ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం 104 దేశాలు, భూభాగాల్లోని 1,799 విశ్వవిద్యాలయాలకు ఇందులో ర్యాంకింగ్స్ అందించారు. భారతదేశ జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF), QS (క్వాక్వారెల్లి సైమండ్స్) ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2023లో తక్కువ ర్యాంక్ పొందిన విశ్వవిద్యాలయాలుగా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU), జామియా మిలియా ఇస్లామియా, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) నిలిచాయి. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (AMU) వంటి ఉన్నత విద్యా సంస్థలు కూడా చోటు దక్కించుకోలేకపోవడంతో ర్యాంకింగ్ దాని పరిమితులు, పారదర్శకత గురించి మరిన్ని ప్రశ్నలను లేవనెత్తింది. THEE, QS ప్రపంచంలోని ఉన్నత విద్యా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు సర్వేలుగా పరిగణిస్తుంటారు. అత్యధిక సంఖ్యలో విశ్వవిద్యాలయాలు ఉన్న దేశాలు ర్యాంకింగ్‌లో చేరగలిగాయి.

ఈ సంవత్సరం ర్యాంకింగ్స్‌లో ఆరు కొత్త భారతీయ విశ్వవిద్యాలయాలు తమ ఖాతాను తెరిచాయి. 351, 400 మధ్య ర్యాంక్‌లను సాధించాయి. ఈ ఆరు విశ్వవిద్యాలయాలలో శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ కూడా ఉంది. మరోవైపు ఐఐటీ గౌహతి మళ్లీ ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

IIT గౌహతి 2020 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించింది. ఈ సంవత్సరం 1001, 1200 మధ్య విశ్వవిద్యాలయాలలో ర్యాంక్‌ను పొందింది. బెంగుళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), IITలు, NITలు, JNU, జామియా లేదా ఢిల్లీ విశ్వవిద్యాలయం వంటి విశ్వవిద్యాలయాలు సాంప్రదాయకంగా గ్లోబల్, నేషనల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే 2000 నుంచి ఈ టాప్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లు ర్యాంకింగ్స్‌లో లేవు. ఏడు IITలు-బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ-2020లో ర్యాంకింగ్స్‌లో ఉందడకూదడని నిర్ణయించుకున్నాయి. కారణం సర్వేల పారదర్శకత, పరిమితుల గురించి ప్రశ్నలు లేవనెత్తుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయంతో పోటీపడండి: THE

THEE ‘చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్’ ఫిల్ బట్టీ మాట్లాడుతూ, గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీ నెట్‌వర్క్‌లో చేరాల్సిన అవసరాన్ని భారతదేశ విధాన నిర్ణేతలు అర్థం చేసుకోవాలని, దేశంలోని విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో పోటీపడేలా తయారవ్వాలని కోరారు.