Thane DCC Bank Jobs 2022: 8వ తరగతి, డిగ్రీ అర్హతతో 288 బ్యాంక్‌ ఉద్యోగాలు.. రేపటితో ముగుస్తున్న దరఖాస్తులు..

|

Sep 04, 2022 | 4:51 PM

డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (DCCB)లో 288 జూనియర్ క్లర్క్‌, ప్యూన్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్‌ దరఖాస్తులకు రేపే (సెప్టెంబర్‌ 5) ఆఖరు తేదీ. ఇప్పటి వరకు..

Thane DCC Bank Jobs 2022: 8వ తరగతి, డిగ్రీ అర్హతతో 288 బ్యాంక్‌ ఉద్యోగాలు.. రేపటితో ముగుస్తున్న దరఖాస్తులు..
Dccb
Follow us on

Thane DCC Bank Jr Clerk and Peon Recruitment 2022: డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (DCCB)లో 288 జూనియర్ క్లర్క్‌, ప్యూన్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్‌ దరఖాస్తులకు రేపే (సెప్టెంబర్‌ 5) ఆఖరు తేదీ. ఇప్పటి వరకు అప్లై చేసుకోని అభ్యర్ధులు రేపు దరఖాస్తు సమయం ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతి, డిగ్రీలో ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 21 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్‌ క్లర్క్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.944, ప్యూన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు రూ.590లు తప్పనిసరిగా అప్లికేషన్‌ ఫీజు రూపంలో చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 90 మార్కులకు 90 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. 10 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాది పాటు ప్రొబేషన్‌ ఉంటుంది. ప్రొబేషన్‌ సమయంలో నెలకు రూ.10,000ల నుంచి రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆ తర్వాత నోటిఫికేషన్లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.