Telangana TRT Results: టీజీపీఎస్సీ టీఆర్టీ – 2017 ఫలితాలు విడుదల.. ఇన్నాళ్లకు ఆ పోస్టులకు మోక్షం

|

Aug 08, 2024 | 7:19 AM

టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధ్యాయ కొలువుల భర్తీ ప్రక్రియకు సంబంధించి టీఆర్టీ - 2017 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. కోర్టు కేసుల నుంచి వివాదంలో ఉన్న మూడు స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ పోస్టులకు మోక్షం లభించింది. దీంతో నోటిఫికేషన్‌లో రిలింక్విష్‌మెంట్‌ అమలు తర్వా త ఉన్న అభ్యర్థులను టీఆర్టీకి ఎంపిక చేశారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్ధుల..

Telangana TRT Results: టీజీపీఎస్సీ టీఆర్టీ - 2017 ఫలితాలు విడుదల.. ఇన్నాళ్లకు ఆ పోస్టులకు మోక్షం
Telangana TRT Results
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 8: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధ్యాయ కొలువుల భర్తీ ప్రక్రియకు సంబంధించి టీఆర్టీ – 2017 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. కోర్టు కేసుల నుంచి వివాదంలో ఉన్న మూడు స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ పోస్టులకు మోక్షం లభించింది. దీంతో నోటిఫికేషన్‌లో రిలింక్విష్‌మెంట్‌ అమలు తర్వా త ఉన్న అభ్యర్థులను టీఆర్టీకి ఎంపిక చేశారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్ధుల వివరాలను టీజీపీఎస్సీ అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మరోవైపు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1392 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతుంది.

ఏఈఈ పోస్టులకు కూడా ఇప్పటికే రాత పరీక్షల ఫలితాలు విడుదల చేయగా.. ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు 8039 గ్రూప్‌-4 పోస్టులు, 53 డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లు (డీఏవో), 581 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు తదితర ఉద్యోగాల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేందుకు టీజీపీఎస్సీ కార్యచరణ రూపొందిస్తుంది.

తెలంగాణ TOSS టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) 2024-25 విద్యా సంవత్సరానికి గానూ పది, ఇంటర్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి (ఆగస్టు 8) నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు డైరెక్టర్‌ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను, డీఈవో కార్యాలయాల్లోనూ సంప్రదించవచ్చని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.