TGPSC Group 2 Answer Key Download: టీజీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్ధులకు అలర్ట్.. రేపే ప్రాథ‌మిక కీ విడుద‌ల‌

టీజీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్ధులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఆన్సర్ మరి కొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ కమిషన్ శుక్రవారం ప్రకటించింది. శనివారం ఆన్సర్ కీతోపాటు ఆన్సర్ షీట్లను కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనుంది. పూర్తి వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..

TGPSC Group 2 Answer Key Download: టీజీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్ధులకు అలర్ట్.. రేపే ప్రాథ‌మిక కీ విడుద‌ల‌
TGPSC Group 2 Key

Updated on: Jan 17, 2025 | 8:12 PM

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్ధులకు టీజీపీఎస్సీ కీల‌క అప్డేట్ ఇచ్చింది. గ్రూప్‌ 2 పరీక్షను ముగిసి నెల రోజులు గడుస్తున్నా ఇంత వరకూ ఆన్సర్‌ విడుదలకాకపోవడంతో అభ్యర్ధుల్లో అందోళన నెలకొంది. దీనికి చెక్‌ పెడుతూ కమిషన్‌ ప్రకటన జారీ చేసింది. 18వ తేదీన గ్రూప్-2 రాత ప‌రీక్ష‌ల ప్రాథ‌మిక కీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టీజీపీఎస్సీ అధికారులు శుక్రవారం (జనవరి 17) ప్ర‌క‌టించారు. శనివారం గ్రూప్‌ 2 ప్రాథమిక విడుదలైన తర్వాత అదే రోజు నుంచి నుంచి జనవరి 22 వ‌ర‌కు అభ్య‌ర్థుల లాగిన్‌లో ప్రాథ‌మిక కీ అందుబాటులో ఉంటుంద‌న్నారు. కీతో పాటు అభ్యర్ధుల ఆన్సర్‌ షీట్లు అందుబాటులో ఉంచుతారు. ప్రాథమిక ఆన్సర్‌కీపై అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లోనే అభ్యంత‌రాల‌ను తెల‌పాల‌ని టీజీపీఎస్సీ అధికారులు సూచించారు.

ప్రాథ‌మిక కీపై జనవరి 18వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అభ్యంత‌రాల‌ను స్వీక‌రిస్తామ‌ని అధికారులు తెలిపారు. అభ్యంత‌రాల‌ను కేవ‌లం ఆన్‌లైన్‌ విధానంలో ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే తెల‌పాల‌ని అధికారులు సూచించారు. అభ్య‌ర్థులు చెప్ప‌ద‌ల‌చుకున్న అభ్యంత‌రాల‌కు త‌ప్ప‌నిస‌రిగా.. ఆ అంశం ఏ పుస్త‌కంలో నుంచి తీసుకున్నారో.. ఆథ‌ర్ ఎవ‌రో, ఎడిష‌న్‌తోపాటు పేజీ నంబ‌ర్, ప‌బ్లిష‌ర్స్ పేరు వంటి వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందని సూచించారు. అభ్యంత‌రాల‌ను ఈ మెయిల్ ద్వారానే పంపాల‌న్నారు.

కాగా గ‌తేడాది డిసెంబ‌ర్ 15, 16 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 రాత‌ప‌రీక్ష‌ను ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. డిసెంబర్‌ 15 (ఆదివారం) జరిగిన పేపర్‌ 1 పరీక్షకు 2,57,981 మంది అంటే 46.75 శాతం మంది, పేపర్‌ 2 పరీక్షకు 2,55,490 మంది అంటే 46.30 మంది పరీక్ష రాశారు. ఇక డిసెంబరు 16న ఉదయం జరిగిన పేపర్‌ 3 పరీక్షకు 2,51,738 (45.62 శాతం) మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్‌ 4 పరీక్షకు 2,51,486 (45.57 శాతం) మంది హాజరయ్యారు. మొత్తం ఈ పరీక్షలకు కనీసం సగం మంది కూడా హాజరుకాలేదు. మొత్తం 783 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రాథ‌మిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.