TGPSC Group 1 Prelims: తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అభ్యర్ధులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్.. ఈ తప్పులు చేశారో పరీక్ష కేంద్రాల్లోకి నో ఎంట్రీ!

|

May 24, 2024 | 9:59 AM

తెలంగాణలో 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్‌ 9వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరగనుంది. గతంలో రెండు సార్లు గ్రూప్‌ 1 పరీక్ష నిర్వహించడంలో టీజీపీఎస్సీ విఫలం అయ్యింది. దీంతో ఈసారి ఎలాంటి పొరబాట్లు జరగకుండా పకడ్భందీగా నిర్వహించాలని కట్టుదిట్టమైన..

TGPSC Group 1 Prelims: తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అభ్యర్ధులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్.. ఈ తప్పులు చేశారో పరీక్ష కేంద్రాల్లోకి నో ఎంట్రీ!
TGPSC Group 1 Prelims
Follow us on

హైదరాబాద్‌ మే 24: తెలంగాణలో 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్‌ 9వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరగనుంది. గతంలో రెండు సార్లు గ్రూప్‌ 1 పరీక్ష నిర్వహించడంలో టీజీపీఎస్సీ విఫలం అయ్యింది. దీంతో ఈసారి ఎలాంటి పొరబాట్లు జరగకుండా పకడ్భందీగా నిర్వహించాలని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. 2022లో ఇచ్చిన గ్రూప్‌1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన రేవతంత్ సర్కార్‌.. 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాల కారణంగా న్యాయవివాదాలు తలెత్తడంతో ప్రిలిమ్స్‌ రద్దయింది. ఈసారి మాత్రం ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ నిర్ణయించింది.

ఓఎంఆర్‌ పద్ధతిలో ప్రిలిమ్స్‌..

4 లక్షలకుపైగా దరఖాస్తులు రావడంతో తొలుత ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ.. ఇంత మందికి ఆన్‌లైన్‌లో నిర్వహించడం సాధ్యంకాదని టీఎస్పీయస్సీ భావించింది. సీబీఆర్‌టీ విధానంలో అయితే సెషన్ల వారీగా పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో.. ఒక్కరోజులోనే పరీక్షను పూర్తి చేసేందుకు ప్రిలిమ్స్‌ను ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఇక గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ హాల్‌టికెట్లు జూన్‌ 1 నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనుంది. ప్రిలిమ్స్‌ అనంతరం మెయిన్‌ పరీక్షలు అక్టోబరు 21న ప్రారంభంకానున్నాయి. మెయిన్‌ పరీక్షలు మొత్తం 7 పేపర్లకు జరుగుతాయి. ప్రిలిమినరీ పరీక్షలో జోన్లవారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో మెయన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రిజర్వుడ్‌ వర్గాలవారీగా 1:50 నిష్పత్తిలో తీసుకుంటారు. రిజర్వుడ్‌ వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఈ సందర్భంగా గ్రూప్‌ 1 అభ్యర్ధులకు ముఖ్య సూచనలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

  • గ్రూప్‌ 1 పరీక్ష సమయంలో వేలిముద్ర, ఫొటో బయోమెట్రిక్‌ తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వనివారిని అనర్హులుగా ప్రకటిస్తారు.
  • అభ్యర్థులు పరీక్ష రోజు హాల్‌టికెట్‌ నంబరు, ఫొటో, పేరు, తండ్రి, తల్లి పేర్లు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, జెండర్‌ వివరాలను ముద్రించిన ఓఎంఆర్‌ జవాబుపత్రం అందిస్తారు. ఇందులో ఏవైనా తప్పులుంటే వెంటనే ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. అప్పుడు వారు సాదా ఓఎంఆర్‌ పత్రాన్ని పొందాలి.
  • జవాబుపత్రంలో జవాబులు గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్‌ పెన్ను ఉపయోగించాలి.
  • పరీక్ష పూర్తయిన తరువాత జవాబు పత్రాలను స్కానింగ్‌ చేసి, అభ్యర్థుల డిజిటల్‌ కాపీలు వెబ్‌సైట్లో పొందుపరుస్తారు.
  • హాల్‌టికెట్‌తో పాటు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు అంటే పాస్‌పోర్టు, పాన్‌ కార్డు, ఓటర్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు ఒరిజినల్‌ తీసుకురావాలి.
  • పరీక్షకేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రం గేట్లు పది గంటలకు మూసివేస్తారు.
  • అభ్యర్థుల బయోమెట్రిక్‌ను పరీక్ష కేంద్రంలో ఉదయం 9.30 నుంచి ప్రారంభిస్తారు. బయోమెట్రిక్‌ పూర్తయ్యేవరకు అభ్యర్థులెవరూ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లకూడదు.
  • బయోమెట్రిక్‌లో ఫింగర్‌ప్రింట్‌ ఇబ్బంది ఎదురైతే.. అభ్యర్థి ఫొటో తీసుకుని, ఇంక్‌ప్యాడ్‌ ద్వారా వేలిముద్రను బయోమెట్రిక్‌గా తీసుకుంటారు.
  • అభ్యర్థులు చేతులపై గోరింటాకు, టాటూలు వేసుకోరాదు

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.