TGPSC Gurukula PET Results: తెలంగాణ గురుకుల పీఈటీ పోస్టులకు తుది ఎంపిక జాబితా వెల్లడి

|

Aug 23, 2024 | 8:16 AM

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ-ప్రకటన నం.16/2017) పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు టీజీపీఎస్సీ విడుదల చేసింది. దీంతో ఏడేళ్లుగా న్యాయ వివాదాల్లో చక్కుకున్న ఈ పోస్టులకు ఎట్టకేలకు మోక్షలం లభించినట్లైంది. మొత్తం 594 మంది అభ్యర్థులతో ప్రాథమిక ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. టీజీపీఎస్సీ అప్పట్లో జారీ చేసిన నోటిఫికేషన్‌లోని..

TGPSC Gurukula PET Results: తెలంగాణ గురుకుల పీఈటీ పోస్టులకు తుది ఎంపిక జాబితా వెల్లడి
Gurukula Pet Results
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 23: తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ-ప్రకటన నం.16/2017) పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు టీజీపీఎస్సీ విడుదల చేసింది. దీంతో ఏడేళ్లుగా న్యాయ వివాదాల్లో చక్కుకున్న ఈ పోస్టులకు ఎట్టకేలకు మోక్షలం లభించినట్లైంది. మొత్తం 594 మంది అభ్యర్థులతో ప్రాథమిక ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. టీజీపీఎస్సీ అప్పట్లో జారీ చేసిన నోటిఫికేషన్‌లోని నిబంధన 6-ఏ ప్రకారం ఎవరైనా అభ్యర్థులు పోస్టును స్వచ్ఛందంగా వదులుకునేందుకు అవకాశం ఇచ్చింది. అందుకు ఆగస్టు 22 నుంచి 24 వరకు రీలింక్వెష్‌మెంట్‌ సదుపాయం అధికారిక వెబ్‌సైట్‌లో కల్పించింది.

సంక్షేమ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల భర్తీకి 2017లో తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో మైనార్టీ గురుకులాల్లో 194, ఎస్సీ గురుకులాల్లో 182, బీసీ గురుకులాల్లో 135, గిరిజన గురుకుల సొసైటీలో 83, సాధారణ గురుకులాల్లో 22 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు కూడా నిర్వహించింది. కానీ ఆ తర్వాత విద్యార్హతలు, సాంకేతిక కారణాల వల్ల న్యాయ వివాదాలు తలెత్తాయి. ఆ వివాదాలన్నింటినీ ఇటీవల పరిష్కరించిన కమిషన్ 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను ప్రకటించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందే అభ్యర్థుల నుంచి సొసైటీల వారీగా ఆప్షన్లు తీసుకుంది. ఆ ఆప్షన్ల ప్రకారం తుది ఫలితాలు వెల్లడించింది.

తెలంగాణ పీఈటీ పోస్టుల రీలింక్వెష్‌మెంట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆగస్టు 22 నుంచి దోస్త్‌ ఇంట్రా కాలేజ్‌ రెండో విడత

తెలంగాణ దోస్త్‌ ద్వారా ఆయా డిగ్రీ కళాశాలల్లో చేరిన విద్యార్థులు అదే కళాశాలలో గ్రూపు మారేందుకు అవకావం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఇంట్రా కాలేజ్‌ రెండో విడత ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆగస్టు 23 తేదీతో వెబ్‌ ఆప్షన్ల నమోదు ముగుస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి తెలిపారు. వీరందరికీ ఆగస్టు 24వ తేదీన సీట్లు కేటాయించనున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.