హైదరాబాద్, జూన్ 16: రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాల్లో ఏకంగా 91.92% మంది ఉత్తీర్ణత సాధించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. తెలంగాణ ఐసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 86,156 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 77,942 మంది పరీక్ష రాశారు. వారిలో 71,647 మంది ఉత్తీర్ణులయ్యారు. తొలి 10 ర్యాంకర్లలో అబ్బాయిలు, అమ్మాయిలు సమానంగా ఉన్నారు. 5, 7 ర్యాంకులను ఏపీ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ… గతేడాది 272 ఎంబీఏ కాలేజీల్లో 35,949 సీట్లు, 64 ఎంసీఏ కాలేజీల్లో 6,990 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సారి మొత్తం 42,939 సీట్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇవికాక మరికొన్ని పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. కౌన్సెలింగ్ తేదీలను త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
టీజీ ఐసెట్ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీజీ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.