TS ICET 2023 Results: మరికాసేపట్లో విడుదలకానున్న తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

తెలంగాణ ఐసెట్‌ 2023 ఫలితాలు ఈ రోజు (జూన్‌ 29) విడుదలకానున్నాయి. ఈమేరకు గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు కాకతీయ యూనివర్సిటీలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు..

TS ICET 2023 Results: మరికాసేపట్లో విడుదలకానున్న తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
TS ICET 2023 Results
Follow us

|

Updated on: Jun 29, 2023 | 7:32 AM

హైదరాబాద్‌: తెలంగాణ ఐసెట్‌ 2023 ఫలితాలు ఈ రోజు (జూన్‌ 29) విడుదలకానున్నాయి. ఈమేరకు గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు కాకతీయ యూనివర్సిటీలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొపెసర్‌ పి వరలక్ష్మి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి, కేయూ ఉప కులపతి ఆచార్య టి రమేశ్‌ విడుదల చేస్తారని ఆమె తెలిపారు. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌ లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

కాగా 2023-24 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్‌ ఐసెట్‌-2023 ప్రవేశ పరీక్ష మే 26, 27 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన నోటిఫికేషన్‌ ప్రకారం మే 20న ఐసెట్‌ ఫలితాలు ప్రకటించవల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదాపడ్డాయి. ఈ పరీక్షకు దాదాపు 70,900 మంది విద్యార్ధులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.