
హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ జనవరి 2025) నోటిఫికేషన్ గురువారం (నవంబర్ 13) సాయంత్రం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2026 ఏడాదికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2026) నిర్వహించేందుకు ప్రకటన జారీ చేసింది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ఇచ్చిన హామీ రేవంత్ సర్కార్ ఈ మేరకు టెట్ నిర్వహించేందుకు ప్రకటన జారీ చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు నవంబర్ 15 నుంచి మొదలవుతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్ 29, 2025వ తేదీ వరకు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక జనవరి 3, 2026 నుంచి జనవరి 31, 2026వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్ లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించింది. అదే తరహాలో ఈ ఏడాది తొలి విడత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) నిర్వహించింది. ఇక మలివిడత నోటిఫికేషన్‌పై కసరత్తు చేసి గురువారం నోటిఫికేషన్ ఇచ్చింది.
తొలి విడత టెట్ నోటిఫికేషన్ ఈ ఏడాది జూన్‌లో జారీ చేశారు. జూలై పరీక్షలు నిర్వహించి వెంటనే జులై 22న ఫలితాలు కూడా వెల్లడించారు. ఇప్పుడు నిర్వహిస్తున్న టెట్ ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగులు సైతం ఒకసారి రాసి క్వాలిఫై అయితే వారికి లైఫ్ లాంగ్ ఆ క్వాలిఫికేషన్ వర్తించేలా నిబంధన ఉన్నది. దీంతో ఎవరైతే అర్హత సాధించలేదొ బిఈడి పూర్తయిన నిరుద్యోగులు రాసి డిఎస్సి కోసం సద్వినియోగం చేసుకోనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.