
హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్‌ను పాఠశాల విద్యా విభాగం విడుదల చేసింది. ఇప్పటికే పేపర్ వన్, పేపర్ 2 కు మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తున్నారు. ఈ టెట్ పరీక్షలు, జనవరి 3, 2026 నుండి జనవరి 20, 2026 వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు కేవలం 9 రోజుల్లో, మొత్తం 15 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించనున్నారు. ప్రతిరోజు పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ (ఉదయం): ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ (మధ్యాహ్నం): మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరగనుంది.
ప్రతి సెషన్ పరీక్షకు అభ్యర్థులకు 2 గంటల 30 నిమిషాల సమయం కేటాయించారు. జిల్లా వారీగా పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఏ రోజు ఏ జిల్లా అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి అనే పూర్తి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థులు తమ పరీక్షా తేదీ, సమయం, కేంద్రాన్ని తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌ను సందర్శించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. అభ్యర్థులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని, పరీక్షలకు సన్నద్ధం కావాలని, పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని అధికారులు కోరారు.
తెలంగాణ టెట్ 2026 అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.