
హైదరాబాద్, నవంబర్ 25: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET -January 2026) జనవరి సెషన్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ దరఖాస్తుల సవరణకు అవకాశాన్ని కల్పిస్తూ ప్రకటన వెలువరించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది.
తెలంగాణ టెట్ 2026 జనవరి ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీజీ టెట్ రిజిస్ట్రేషన్‌కు నవంబర్ 29 వరకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,26,085 దరఖాస్తులు వచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నవీన్ నికోలస్ తెలిపారు. ఇందులో పేపర్ 1కు 46,954, పేపర్ 2కు 79,131 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక టెట్ ఆన్‌లైన్ రాత పరీక్షు 2026 జనవరి 3 నుంచి జనవరి 31 వరకు ఆన్‌లైన్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు డిసెంబర్ 27 నుంచి అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక ఏపీలో మాదిరి గానే తెలంగాణలోనూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ మేరకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు టీఎస్ యూటీఎఫ్ ప్రకటించింది. మంగళవారం ప్రధానమంత్రికి, ఈ నెలాఖరు వరకు ఎంపీలకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రం తక్షణమే స్పందించి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో టెట్‌పై చర్చలు జరిపి, చట్టం చేయాలని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను కోరనున్నట్టు వెల్లడించారు.
తెలంగాణ టెట్ 2026 జనవరి సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.