TG TET 2024 New Syllabus: తెలంగాణ ‘టెట్‌’ కొత్త సిలబస్‌ ఇదే.. ఒక్క క్లిక్‌తో డౌన్‌లోడ్‌ చేసుకోండి

|

Dec 08, 2024 | 7:27 AM

తెలంగాణ టెట్ 2024 కొత్త సిలబస్ విడుదలైంది. పరీక్షలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జరగనుండగా.. విద్యాశాఖ తాజాగా టెట్ సిలబస్ ను వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే కొత్త సిలబస్ కు పాత సిలబస్ కు ఎలాంటి మార్పులు జరిగాయో ఈ కింద పొందుపరిచాం..

TG TET 2024 New Syllabus: తెలంగాణ టెట్‌ కొత్త సిలబస్‌ ఇదే.. ఒక్క క్లిక్‌తో డౌన్‌లోడ్‌ చేసుకోండి
TG TET 2024 New Syllabus
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 8: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024)కు సంబంధించిన ఆన్‌లైన్‌ పరీక్షలు వచ్చే నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యాశాఖ టెట్‌ సిలబస్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో జనవరి 1 నుంచి 20 తేదీల మధ్య నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. ఆ క్రమంలో తాజాగా పేపర్‌ 1, 2లకు సంబంధించి సిలబస్‌ను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. తాజా టెట్ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని, గత టెట్‌కు, తాజా టెట్‌ సిలబస్‌కు ఒకటే సిలబస్‌ అని, ఎలంటి మార్పు లేదని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

కాగా టీజీ టెట్‌ 2024 (నవంబర్‌) పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,75,773 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వీటిలకలె టెట్‌ పేపర్‌ 1కు 94,335 దరఖాస్తులు, పేపర్‌ 2కు 1,81,438 దరఖాస్తులు వచ్చాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 20వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో ప్రతి రోజు రెండు సెష‌న్లలో నిర్వహించేలా అధికారలు ఏర్పాట్లు చేయ‌నున్నారు. ఉద‌యం సెష‌న్ పరీక్ష 9 నుంచి 11.30 గంటల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నాం సెష‌న్ 2 గంట‌ల నుంచి 4.30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. ఇక టెట్ పరీక్షల అనంతరం ఫలితాలు ఫిబ్రవ‌రి 5వ తేదీన వెల్లడించ‌నున్నారు.

తెలంగాణ టెట్ 2024 నవంబర్‌ సిలబస్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పరీక్ష విధానం ఇదే..

టెట్‌ పరీక్షలో మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 1 నుంచి 5 తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు పేపర్ 1 పరీక్ష, ఆరు నుంచి పదో తరగతి వరకు బోధించే వారికి పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ అభ్యర్థులకు 90 మార్కులు, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు సాధిస్తేనే టెట్‌లో ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఇక టెట్‌లో అర్హత సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం ఉంటుంది. టెట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డీఎస్సీ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. ఇటీవల తెలంగాణలో మెగా డీఎస్సీ ముగియగా.. త్వరలోనే మరోమారు డీఎస్సీ నిర్వహిస్తామని రేవంత్‌ సర్కార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్టులు 5వేలు లేదా 6 వేలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో అభ్యర్ధులు టెట్ స్కోర్ పెంచుకునేందుకు మరోమార పోటీపడుతున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.