TG TET 2024 Last Date: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న దరఖాస్తు గడువు

|

Nov 20, 2024 | 2:22 PM

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024) దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో సమీపిస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు రూ.750 ఫీజు చెల్లించి వ వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ ఏడాది నిర్వహించిన టెట్ కు హాజరైన వారైతే ఎలాంటి ఫీజు లేకుండానే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు..

TG TET 2024 Last Date: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న దరఖాస్తు గడువు
TET 2024
Follow us on

హైదరబాద్‌, నవంబర్‌ 20: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024) దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు బుధవారం (నవరంబర్ 20) రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్‌ 19వ తేదీ రాత్రి 8.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,07,765 దరఖాస్తులు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్‌ ఛైర్మన్‌ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. వీరిలో పేపర్‌ 1కు 61,930 మంది, పేపర్‌ 2కు 1,28,730 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఇవాళ చివరి రోజుకావడంతో ఈ రోజు దరఖాస్తు సమయం ముగిసేనాటికి మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే టెట్‌ దరఖాస్తుల గడువును మరో రెండు, మూడు రోజులు పొడగించాలని బీఎడ్‌, డీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి విద్యాశాఖ అధికారులను కోరారు. బీఎడ్‌ చేసిన వారు పేపర్‌ 2కు, డీఎడ్‌ చేసిన వారు పేపర్‌ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇక టెట్‌ హాల్ టికెట్స్ డిసెంబ‌ర్ 26 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి 20 వ‌ర‌కు కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో టెట్‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌తి రోజు రెండు సెష‌న్ల‌లో ఈ పరీక్షలు నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేయ‌నున్నారు. ఉద‌యం సెష‌న్ 9 నుంచి 11.30 గంటల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నాం సెష‌న్ 2 గంట‌ల నుంచి 4.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఇక టెట్ ఫలితాలు ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన వెల్ల‌డించ‌నున్నారు.

టెట్‌ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ అభ్యర్థులకు 90 మార్కులు, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే టెట్‌ ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. రిజర్వేషన్ల ఆధారంగా నిర్దేశిత మార్కులు సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం లభిస్తుంది. టెట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డిఎస్సీ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ టెట్‌ పరీక్ష తర్వాత త్వరలోనే మరోమారు డీఎస్సీ నిర్వహిస్తామని ఇప్పటికే రేవంత్‌ సర్కార్ ప్రకటించింది. ఇచ్చిన మాటమీద ఎంతవరకు నిలబడుతుందో వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.