TS TET 2022 Results: నేడు విడుదల కానున్న తెలంగాణ టెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..

|

Jul 01, 2022 | 5:53 AM

TS TET 2022 Results : తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) ఫలితాలు శుక్రవారం (జులై 1) విడుదలకానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఉద‌యం 11:30 గంట‌ల‌కు ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

TS TET 2022 Results: నేడు విడుదల కానున్న తెలంగాణ టెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..
Ts Tet 2022 Results
Follow us on

TS TET 2022 Results : తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) ఫలితాలు శుక్రవారం (జులై 1) విడుదలకానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఉద‌యం 11:30 గంట‌ల‌కు ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటికే టెట్‌ ఫైనల్‌ కీ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో నేడు ఫలితాలు ప్రకటించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 12న నిర్వహించిన టెట్‌ పరీక్షలో పేపర్‌-1కు 3,18,506, పేపర్‌-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా నోటిఫికేషన్ విడుదల సమయంలోనే ఫలితాలను జూన్ 27న ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఫలితాల విడుదల ఆలస్యం కానున్నట్లు టెట్ కన్వీనర్ ప్రకటించారు. ఆ తర్వాత మరింత కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. అయితే తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెట్‌ ఫలితాల విడుదలపై స్పష్టత ఇచ్చారు. జులై 1న రిజల్ట్స్‌ను ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు.

కాగా టెట్‌ పరీక్షకు సంబంధించి ఈ నెల 15న ప్రైమరీ కీ విడుదలవగా.. జూన్ 29న టెట్ ఫైనల్ కీని అధికారులు రిలీజ్‌ చేశారు. ఈ కీలో కొన్ని ప్రశ్నలకు మార్కులను కలుపగా.. మరికొన్ని ప్రశ్నలకు డబుల్ ఆన్సర్స్‌ ఇచ్చారు. పేపర్ -1లో 4 మార్కులను కలపగా.. మరో 4 ప్రశ్నలకు రెండు సమాధానాలను గుర్తించారు. మొత్తంగా 8 ప్రశ్నలకు మార్పులు చేశారు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే.. మ్యాథమేటిక్స్ , సైన్స్ మరియు సోషల్ స్టడీస్ కీలో నాలుగు మార్కులను కలుపగా.. మరో ప్రశ్నకు రెండు సమాధానాలు గుర్తించారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు టెట్ ను నిర్వహించారు. అయితే గతంలో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి సులువుగా ఉందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ సారి అధిక సంఖ్యలో టెట్‌ పరీక్షలో అర్హత సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులు తమ టెట్‌ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌ (https://tstet.cgg.gov.in/)లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..