TG SET 2024: తెలంగాణ ‘సెట్‌’ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు.. పరీక్ష తేదీలు ఇవే!

|

Jul 05, 2024 | 1:55 PM

తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్‌ సెట్‌)-2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు తుది గడువును పొడిగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన వెలువరించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే సెట్‌ పరీక్షకు ఈ ఏడాది మే 4న నోటిఫికేషన్‌ వెలువరించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మే 14న మొదలవగా.. జులై 2తో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే తాజాగా..

TG SET 2024: తెలంగాణ సెట్‌ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు.. పరీక్ష తేదీలు ఇవే!
TS SET 2024
Follow us on

తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్‌ సెట్‌)-2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు తుది గడువును పొడిగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన వెలువరించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే సెట్‌ పరీక్షకు ఈ ఏడాది మే 4న నోటిఫికేషన్‌ వెలువరించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మే 14న మొదలవగా.. జులై 2తో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే తాజాగా దరఖాస్తు గడువును జులై 8వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటన వెలువడింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జులై 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1500 ఆలస్య రుసుముతో జులై 16 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో జులై 26 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో ఆగస్టు 6 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

ఆగస్టు 8, 9 తేదీల్లో దరఖాస్తు సవరణకు అవకాశం ఉంటుంది. ఇక ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో సెట్‌ పరీక్షలు జరగనుంది. ఇందుకు సంబంధించి హాల్‌ టికెట్లు ఆగస్టు 20, 2024 తేదీ నుంచి వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటనల విడుదల చేసింది. జనరల్‌ స్టడీస్‌, 29 సబ్జెక్టుల్లోఈ పరీక్ష జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీజీ సెట్‌)-2024కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 55 శాతం మార్కులతో సంబంధి సబ్జెక్టులో ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్‌ (సీఎస్ఈ, ఐటీ)లలో ఏదైనా ఒకదానిలో పీజీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎలాంటి వయోపరిమితి ఉండదు. సీబీటీ పద్ధతిలో జరిగే ఈ పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

ఏయే సబ్జెక్టుల్లో పరీక్ష జరుగుతుందంటే..

ఇవి కూడా చదవండి

జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్ 1), పేపర్‌ 2లో జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టులకు పరీక్ష ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.