TS Staff Nurse Document Verification: డిసెంబరు 27 నుంచి స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన..

|

Dec 24, 2023 | 12:27 PM

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు డిసెంబరు 27 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది జనవరి 6 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ధ్రువపత్రాల పరిశీలనకు..

TS Staff Nurse Document Verification: డిసెంబరు 27 నుంచి స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన..
TS Staff Nurse
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 24: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు డిసెంబరు 27 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది జనవరి 6 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ధ్రువపత్రాల పరిశీలనకు ఆ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పరిశీలనకు 70 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 7094 స్టాఫ్‌నర్స్‌ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. 40,936 మంది రాత పరీక్షకు హాజరయ్యారు.

జేఎన్‌వీ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల.. జనవరి 20వ తేదీన పరీక్ష

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో జనవరి 20వ తేదీన పరీక్ష జరుగనుంది. ప్రవేశ పరీక్షకు జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు వెబ్ సైట్ నుంచి అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

బార్క్‌ స్టైపెండరీ ట్రైనీ ప్రిలిమ్స్ ఫలితాలు.. ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

భాభా అణు పరిశోధనా కేంద్రం(బార్క్‌)లో స్టైపెండరీ ట్రైనీ (ల్యాబొరేటరీ/ ప్లాంట్‌ ఆపరేటర్‌) నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రిలిమ్స్‌లో మొత్తం 3,146 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరంతా అడ్వాన్స్‌డ్ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్షలు నవంబర్‌ 18 నుంచి 24వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. భారత అణు శక్తి విభాగానికి చెందిన బార్క్‌- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా డీఏఈ విభాగాల్లో మొత్తం 4,374 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. బార్క్‌ స్టైపెండరీ ట్రైనీ (ల్యాబొరేటరీ) ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి. బార్క్‌ స్టైపెండరీ ట్రైనీ (ప్లాంట్‌ ఆపరేటర్‌) ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయం

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.