TG 10th Public Exams Fee: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

|

Jan 12, 2025 | 10:22 AM

తెలంగాణలో ఈ ఏడాది మార్చిలో జరగనున్న పదో తగరతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి మరో అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. తుది గడువు ఎప్పటి వరకంటే..

TG 10th Public Exams Fee: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
TG 10th Public Exams
Follow us on

హైదరాబాద్‌, జనవరి 12: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోమారు పొడిగించింది. రూ.1000 ఆలస్య రుసుముతో జనవరి 22 వరకు రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇదే చివరి అవకాశమని, మరోమారు ఫీజు చెల్లింపు తుది గడువు పొడిగించడం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్ధులు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసకున్న వారిని మాత్రమే పబ్లిక్ పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని, ఫీజు కట్టని వారికి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వబోమని పేర్కొన్నారు. కాగా టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది.

పదో తరగతి పరీక్షలు గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా 80 శాతం మార్కులకు జరగనున్నాయి. వచ్చే ఏడాది 2025-26 నుంచి మాత్రం పబ్లిక్‌ పరీక్షలు 100 మార్కులకు జరగనున్నాయి. ఈ నిబంధనలో మార్చి 21 నుంచి ప్రారంభం అయ్యే మార్కులు 80 శాతం మార్కులకు జరగనుండగా.. 20 శాతం మార్కులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నుంచి కలపనున్నారు. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు గ్రేడ్‌ విధానంలో కాకుండా మార్కుల రూపంలో వెల్లడించనున్నారు. గతంలో గ్రేడింగ్ రూపంలో ఇస్తున్న ఫలితాలను ఎత్తివేస్తూ మార్కులను ప్రకటించనున్నట్లు ఇటీవల విద్యాశాఖ జీవో జారీ చేసింది కూడా.

ఇవి కూడా చదవండి

తెలంగాణ పదో తరగతి 2025 పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..

  • 2025 మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్
  • 2025 మార్చి 22 న సెకెండ్ లాంగ్వేజ్
  • 2025 మార్చి 24 న ఇంగ్లీష్ ఎగ్జామ్
  • 2025 మార్చి 26 న మ్యాథ్స్
  • 2025 మార్చి 28 న ఫిజికల్ సైన్స్
  • 2025 మార్చి 29 న బయోలాజికల్ సైన్స్
  • 2025 ఏప్రిల్ 2 న సోషల్ స్టడీస్

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.