TG 10th Supply 2024 Results: పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

|

Jun 28, 2024 | 4:25 PM

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం (జూన్‌ 28) విడుదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చని తెలంగాణా పాఠశాల విద్యాశాఖ పేర్కొంది...

TG 10th Supply 2024 Results: పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
TG 10th Supply 2024 Results
Follow us on

హైదరాబాద్‌, జూన్‌ 28: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం (జూన్‌ 28) విడుదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చని తెలంగాణా పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 3 నుంచి 11 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 51,237 మంది అభ్యర్ధులు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలురు 31,625 మంది, బాలికలు 19,612 మంది ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 73.03 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించినట్లుగా విద్యాశాఖ వెల్లడించింది. బాలుర ఉత్తీర్ణత 71.01 శాతం, బాలికల ఉత్తీర్ణత 76.37 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 170 పరీక్ష కేంద్రాలో జరిగిన సంగతి తెలిసిందే.

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి.
  • హోమ్ పేజీలో TS SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు 2024 లింక్‌పూ క్లిక్ చేయాలి.
  • వెంటనే న్యూపేజీ ఓపెన్‌ అవుతుంది. అభ్యర్థులు తమ రోల్ నంబర్‌ను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. అనంతరం రిజల్ట్స్‌ పేజీని సేవ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం పేజీని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

తెలంగాణ పదో తరగతి 2024 సప్లిమెంటరీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డుఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. జూన్‌ 24న రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఫలితాలను వెల్లడించింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 63.86 శాతం, సెకెండ్ ఇయర్‌లో 43.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇంటర్, పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు వెనువెంటనే వెలువరించడంతో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.