TS SI, ASI Answer Key 2023: తెలంగాణ ఎస్సై, ఏఎస్సై తుది రాతపరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల

తెలంగాణ ఎస్సై, ఏఎస్సై నియామకాలకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు నిర్వహించిన తుది రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ 'కీ' మే 10న‌ తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) విడుదల..

TS SI, ASI Answer Key 2023: తెలంగాణ ఎస్సై, ఏఎస్సై తుది రాతపరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల
TSLPRB

Updated on: May 11, 2023 | 7:46 PM

తెలంగాణ ఎస్సై, ఏఎస్సై నియామకాలకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు నిర్వహించిన తుది రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ మే 10న‌ తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) విడుదల చేసింది. కాగా మార్చి 11న ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో ఏఎస్సై పరీక్షలు జరిగాయి. పీటీవో ఎస్సై పరీక్ష మార్చి 26న జరిగింది. అర్థమెటిక్‌ అండ్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ పరీక్ష ఏప్రిల్‌ 8న జరుగగా.. ఏప్రిల్‌ 9న జనరల్‌ స్టడీస్‌ పరీక్ష నిర్వహించారు.

ఈ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాల ఆన్సర్ ‘కీ’ అధికారిక వెబ్‌సైట్‌ లో మే 11న‌ అందుబాటులో ఉంచినట్లు బోర్డు ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు వెల్లడించారు. కీపై ఎవైనా అభ్యంతరాలుంటే మే 14న సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌ విధానంలో నమోదు చేయాలని సూచించారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ఎస్సై సివిల్‌ ఆన్సర్‌ ‘కీ’ కోసం క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఎస్సై ఐటీ, పీటీవో, ఏఎస్సై ఎఫ్‌పీబీ ఆన్సర్‌ ‘కీ’ కోసం క్లిక్ చేయండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.