తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు సోమవారం (జనవరి 9) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఆరో తరగతితోపాటు ఆయా మోడల్ స్కూళ్లలో 7 నుంచి 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు కూడా జనవరి 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలని మోడల్ స్కూల్స్ అడిషనల్ సెక్రటరీ ఉషారాణి ఈ సందర్భంగా వెల్లడించారు. ఆసక్త కలిగిన విద్యార్ధుల తల్లిదండ్రులు ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ మోడల్ స్కూల్ ఉన్న మండల కేంద్రాల్లో ఏప్రిల్ 16న (ఆదివారం) నిర్వహిస్తారు. పరీక్ష అనంతరం ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. ప్రవేశ ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలు మోడల్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.