TS MHSRB Jobs 2022: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1326 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..పూర్తి వివరాలివే!

|

Jun 16, 2022 | 7:15 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైద్యారోగ్య శాఖలో 1,326 ఉదోగ్యాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులుకోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

TS MHSRB Jobs 2022: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1326 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..పూర్తి వివరాలివే!
Mhsrb Telangana
Follow us on

MHSRB Telangana Civil Assistant Surgeon Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైద్యారోగ్య శాఖలో 1,326 ఉదోగ్యాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులుకోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులన్నింటికీ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (Telangana MHSRB) ద్వారా భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 1326

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టులు: 751
  • వైద్య విద్య డైరెక్టరేట్‌లో ట్యూటర్ పోస్టులు: 357
  • తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో సివిల్ సర్జన్ జనరల్ పోస్టులు: 211
  • ఐపీఎంలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు: 7

పే స్కేల్‌:

  • సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050
  • ట్యూటర్ పోస్టులకు నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు జీతంగా చెల్లిస్తారు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ. 200

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 15, 2022 ఉదయం 10 గంటల 30 నిముషాల నుంచి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 14, 2022 సాయంత్రం 5 గంటల వరకు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.