TS LAWCET 2024 Exams: జూన్‌ 3న లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు.. రేపటితో ముగుస్తున్న ఆన్‌లైన్‌ దరఖాస్తులు

|

May 19, 2024 | 8:53 AM

తెలంగాణలో లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2024 పరీక్షలను జూన్‌ 3న నిర్వహిస్తున్నట్లు సెట్‌ కన్వీనర్‌ విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. రూ.2,000 ఆలస్య రుసుంతో మే 20వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే మే 20 నుంచి 25వ తేదీ వరకు సరిచేసుకోవడానికి ఎడిట్‌ ఆప్షన్‌..

TS LAWCET 2024 Exams: జూన్‌ 3న లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు.. రేపటితో ముగుస్తున్న ఆన్‌లైన్‌ దరఖాస్తులు
TS LAWCET 2024
Follow us on

హైదరాబాద్‌, మే 19: తెలంగాణలో లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2024 పరీక్షలను జూన్‌ 3న నిర్వహిస్తున్నట్లు సెట్‌ కన్వీనర్‌ విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. రూ.2,000 ఆలస్య రుసుంతో మే 20వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే మే 20 నుంచి 25వ తేదీ వరకు సరిచేసుకోవడానికి ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంచనున్నట్లు కూడా ఆమె తెలిపారు. జూన్‌ 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2024 పరీక్షల షెడ్యూల్ ఇదే

మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్‌ పరీక్ష ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు టీఎస్‌ పీజీఎల్‌సెట్ 2024 పరీక్ష నిర్వహిస్తారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డులు విడుదల.. మే 26న పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష మే 26వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌లో పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం సెషన్‌లో పేపర్-2 పరీక్ష.. ఇలా మొత్తం రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో ర్యాంకులు పొందిన వారికి దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో నిర్వహించే కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్‌ చేయండి.

మే 19న తెలంగాణ ఈసెట్‌ 2024 ఫలితాలు

పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులకు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే తెలంగాణ ఈసెట్‌ ఫలితాలను రేపు (మే 20వ తేదీన) విడుదల చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి చేతుల మీదగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఈసెట్‌ కన్వీనర్‌ తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.