TS Inter Practical Exams 2024: రేపట్నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలు..3.21 లక్షల విద్యార్థులకు ప్రాక్టికల్స్‌

|

Jan 31, 2024 | 1:56 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కాలేజీల్లో చదువుతోన్న ఇంటర్ విద్యార్ధులకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ గురువారం (ఫిబ్రవరి 1) నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించునున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు, రెండో విడత ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు, మూడో విడత ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు ప్రాక్టికల్స్‌ కొనసాగుతాయి. మొత్తం 2,032 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు..

TS Inter Practical Exams 2024: రేపట్నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలు..3.21 లక్షల విద్యార్థులకు ప్రాక్టికల్స్‌
TS Inter Practical Exams
Follow us on

హైదరాబాద్‌, జనవరి 31: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కాలేజీల్లో చదువుతోన్న ఇంటర్ విద్యార్ధులకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ గురువారం (ఫిబ్రవరి 1) నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించునున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు, రెండో విడత ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు, మూడో విడత ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు ప్రాక్టికల్స్‌ కొనసాగుతాయి. మొత్తం 2,032 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి. జనరల్‌ కోర్సుల్లో 3.21 లక్షల మంది విద్యార్ధులు, వొకేషనల్‌లో 94 వేల మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. ఎంపీసీలో 2,17,714, బైపీసీలో 1,04,089 మంది విద్యార్థులు, వొకేషనల్‌ ఫస్టియర్‌లో 48,277, సెకండియర్‌లో 46,542 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌ పరీక్షలు రాయనున్నారు.

ఇక ఇంటర్‌ ఫస్టియర్‌లోని విద్యార్థులకు ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ఈ ఏడాది నుంచి తొలిసారిగా ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌వాల్యూస్‌ (పాత బ్యాచ్‌ బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు) పరీక్ష నిర్వహిస్తారు.

ఏపీలో ఫిబ్రవరి 11 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. మార్కుల నమోదులో కొత్త విధానం

మరోవైపు ఏపీలోనూ ఫిబ్రవరి నెలలోనే ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్‌ సాధారణ కోర్సులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 11 నుంచి 20వరకు జరగనున్నాయి. వృత్తి విద్య కోర్సులకు అదే నెల 5 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌ మార్కుల నమోదులో ఇంటర్‌ విద్యామండలి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రాక్టికల్‌ పరీక్ష ముగిసిన వెంటనే ఏ రోజు మార్కులను ఆ రోజే కంప్యూటర్‌లో నమోదు చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. ఎగ్జామినర్‌ విధిగా మార్కుల వివరాలు నమోదు చేయవల్సి ఉంటుంది. అలాగే పరీక్షల పర్యవేక్షణకు హాజరైన ఎగ్జామినర్‌ ఫోన్‌కు ఇంటర్‌ విద్యామండలి ఓటీపీ ఆధారంగా కాలేజీ కంప్యూటర్‌ ద్వారా వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో కొనసాగాలని బోర్డు ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాన్యువల్‌గా మార్కులు నమోదు చేయకూడదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.