AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mass Copying: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో ‘మాస్‌ కాపీయింగ్‌’.. 47 మంది ఎగ్జామినర్లపై సస్పెన్షన్‌ వేటు!

రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పరీక్ష కేంద్రాల్లో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రాక్టికల్స్‌లో మాస్‌ కాపీయింగ్‌ కోసం కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇంటర్‌బోర్డు దృష్టికి..

Mass Copying: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో ‘మాస్‌ కాపీయింగ్‌'.. 47 మంది ఎగ్జామినర్లపై సస్పెన్షన్‌ వేటు!
Mass Copying During Inter Practical Exams
Srilakshmi C
|

Updated on: Feb 07, 2026 | 3:53 PM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పరీక్ష కేంద్రాల్లో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రాక్టికల్స్‌లో మాస్‌ కాపీయింగ్‌ కోసం కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇంటర్‌బోర్డు దృష్టికి వచ్చింది. దీంతో 5 కళాశాలల్లో ప్రాక్టికల్స్‌ కేంద్రాలపై కొరడా జులిపించింది. ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీ కెమెరాల్లో ఈ కాలేజీల బండారం బయటపడింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 4న జరిగిన ప్రాక్టికల్ పరీక్షల్లో పలు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు బోర్డు గుర్తించింది. ఇలా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగిన ప్రాక్టికల్‌ పరీక్షల్లో మొత్తం 47 మంది ఎగ్జామినర్లు, ఇతర ల్యాబ్‌ సిబ్బందిని విధుల నుంచి బోర్డు తొలగించింది. అలాగే సదరు 5 కాలేజీల్లో ప్రాక్టికల్స్‌ రద్దు చేసింది. దీంతో ఈ కాలేజీల్లో ప్రాక్టికల్స్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను సమీపంలోని ఇతర కాలేజీలకు కేటాయించారు.

ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నా.. వాటిని ఆఫ్‌ చేసి ట్యాంపరింగ్‌ చేసి మాస్‌ కాపియింగ్‌కు తెరలేపారు. జూబ్లీహిల్స్ రెసోనెన్స్, మలక్‌‌పేట ఎంఎస్, షాహీన్, కూకట్‌‌పల్లిలోని 2 ప్రముఖ కార్పొరేట్ కాలేజీల్లోనే మాస్‌‌ కాపీయింగ్‌‌ జరిగినట్లు వెల్లడైంది. ప్రయోగ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో కొన్ని ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగా ఈ భాగోతాన్ని నుడపుతున్నాయి. ఇన్విజిలేటర్లతో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు కాపీలు అందిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు తేలింది.

కాగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 4.07 లక్షల మంది ప్రాక్టికల్స్‌కు హాజరవుతున్నారు. ప్రాక్టికల్స్‌ కోసం పలు ప్రైవేట్‌ కళాశాలలు ఒక్కో విద్యార్థి కోసం రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేసి ఎగ్జామినర్లకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఆయా పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా.. ఆయా పరీక్ష కేంద్రాల్లో విధుల్లోని ఎగ్జామినర్లు, ఇతర ల్యాబ్‌ సిబ్బందిపైనే చర్యలు తీసుకుంటున్నామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..
ఫోన్‌లో యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్ ఎలా చేయాలి? జస్ట్ ఒక ట్యాప్‌
ఫోన్‌లో యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్ ఎలా చేయాలి? జస్ట్ ఒక ట్యాప్‌