TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేది ఆ రోజే.. రిజల్ట్స్‌ ఆలస్యానికి కారణం ఇదేనా.?

TS Inter Results: తెలంగాణలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఫలితాల విషయంలో రోజుకో తేదీ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే...

TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేది ఆ రోజే.. రిజల్ట్స్‌ ఆలస్యానికి కారణం ఇదేనా.?
Ts Tet Exam

Updated on: Jun 24, 2022 | 8:24 AM

TS Inter Results: తెలంగాణలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఫలితాల విషయంలో రోజుకో తేదీ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న ఫలితాలు రానున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం తెలంగాణ ఇంటర్‌ పరీక్షలను 25న కాకుండా 26న విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినప్పటికీ, టెక్నికల్‌ విషయాల పరంగా ఎలాంటి తప్పులు జరగకూడదనే ఉద్దేశంతోనే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. పరీక్షల రిజల్ట్స్‌ ఆలస్యం కావడానికి కూడా ఇదే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్‌ బోర్డ్‌ అధికారులు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. ఫలితాలు ఆలస్యమైనా పర్లేదు కానీ ఫలితాల్లో ఎలాంటి తప్పులు దొర్లకూడదని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గతేడాది ఇంటర్‌ ఫలితాల్లో కేవలం 49 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించడం.. తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో చివరికి కనీస మార్కులతో అందరినీ పాస్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కరోనా ప్రభావం లేకపోవడంతో క్లాస్‌లు పూర్తి స్థాయిలో నిర్వహించారు ఈ కారణంగా గతేడాది పరిస్థితులు తలెత్తవని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..