TS Inter Board: ఇంటర్ బోర్డును ఓ వ్యక్తి గుప్పిట్లో పెట్టుకున్నారు.. సెక్రటరీ నవీన్ మిట్టల్ సంచలన వ్యాఖ్యలు.
తెలంగాణలో ఇంటర్ పేపర్ల ఆన్‌లైన్ వాల్యుయేషన్‌పై రగడ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డ్ బోర్డ్ తీసుకున్న నిర్ణయంపై కొందరు తప్పుపడుతున్నారు. లెక్చరర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండా, ఆన్‌స్ర్కీన్ వాల్యుయేషన్‌కు అవసరమైన ఏర్పాట్లను చేయకుండానే ఈ విధానాన్ని అమలు...
తెలంగాణలో ఇంటర్ పేపర్ల ఆన్‌లైన్ వాల్యుయేషన్‌పై రగడ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డ్ బోర్డ్ తీసుకున్న నిర్ణయంపై కొందరు తప్పుపడుతున్నారు. లెక్చరర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండా, ఆన్‌స్ర్కీన్ వాల్యుయేషన్‌కు అవసరమైన ఏర్పాట్లను చేయకుండానే ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం మంచిది కాదని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఈ విషయమై ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ స్పందించారు. ఆన్‌లైన్ వాల్యుయేషన్ విధానంపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో ముచ్చటించిన నవీన్ మిట్టల్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ బోర్డులో సమానంగా మరో కమిషనర్ వ్యవస్థ నడుస్తోందని ఆరోపించారు. వ్యవస్థను ఓ వ్యక్తి గుప్పిట్లో పెట్టుకున్నారని తెలిపారు. కొందరు సీసీ కెమెరాలను ట్యాంపర్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఒక అధికారితో మాట్లాడిన విషయాలు మూడో వ్యక్తికి వెంటనే తెలిసిపోతున్నాయి. సీసీ కెమెరాల పాస్ వర్డ్ కూడా ప్రస్తుతం ఉద్యోగంలో లేని వ్యక్తి రన్ చేస్తున్నాడు. మాన్యువల్ వాల్యుఎషన్ ద్వారా డబ్బులు సంపాదించే వారే ఆన్ లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంటర్ బోర్డులో డాటా చోరి అయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాము’ అని నవీన్ చెప్పుకొచ్చారు. మరి ఇంటర్ బోర్డులో నెలకొన్న ఈ పరిస్థితికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో వేచి చూడాలి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..