Layoffs: లే ఆఫ్‌తో ఉద్యోగులు నడిరోడ్డుపైకి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో కలవరం
దిగ్గజ కంపెనీలు.. లక్షల్లో ప్యాకేజీలు.. బిందాస్ లైఫ్. సాప్ట్‌వేర్ జాబ్ అంటే స్మార్ట్ లైఫ్. టైమ్‌కి జీతాలు. వీకెండ్ పార్టీలు.. వర్క్ ఫ్రమ్ హోమ్. జాబ్ గురించి టెన్షనే అక్కర్లేదు. ఇది నిన్నటిదాకా ఉన్న పరిస్థితి..
దిగ్గజ కంపెనీలు.. లక్షల్లో ప్యాకేజీలు.. బిందాస్ లైఫ్. సాప్ట్‌వేర్ జాబ్ అంటే స్మార్ట్ లైఫ్. టైమ్‌కి జీతాలు. వీకెండ్ పార్టీలు.. వర్క్ ఫ్రమ్ హోమ్. జాబ్ గురించి టెన్షనే అక్కర్లేదు. ఇది నిన్నటిదాకా ఉన్న పరిస్థితి. ఇప్పుడంతా టెన్షన్ టెన్షన్.. ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా? ఏ రోజు మెయిల్‌కి ఊస్టింగ్ ఆర్డర్ వస్తుందోనని కంగారు. పింక్ స్లిప్ అందితే ఏం చేయాలి? ఈఎమ్ఐలు ఎలా చెల్లించాలి? ఐటీ రంగానికి గడ్డు పరిస్థితులు ఎన్నాళ్లు ఉంటాయి? ఆర్థిక మాంద్యం ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇలా రకరకాల భయాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.
ఆర్థిక మాంద్యం దిగ్గజ కంపెనీల్ని భయపెడుతున్నాయి. ముప్పు నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుకుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉద్యోగుల తొలగింపే ఫస్ట్ ఆప్షన్‌గా పెట్టుకున్నాయి. ఒకేసారి వేల సంఖ్యలో కోత విధిస్తున్నాయి. పింక్ స్లిప్పుల్ని యమ స్పీడ్‌గా పంపుతున్నాయి. ప్రసూతి సెలవుల్లో మహిళా ఉద్యోగుల్ని సైతం వదలడం లేదు. కొందరికి జాయిన్ అయిన 2 నెలలకే ఊస్టింగ్ ఆర్డర్స్ వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మెటా, ట్విట్టర్‌లాంటి దిగ్గజ కంపెనీల నుంచి చిన్నకంపెనీల వరకు ఉద్యోగాలకు కోతపెడుతన్నాయి. మెటాలో 11,000, ట్విట్టర్ 3.500, బైజుస్ 2,500, స్పాప్ 1,300, మైక్రోసాఫ్ట్ 1,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఇంటెల్ 20శాతం ఉద్యోగాలు, స్ట్రైప్ 14 శాతం ఉద్యోగాలకు కోత పెట్టాయి. అమెజాన్ , యాపిల్ కంపెనీలు రిక్రూట్ మెంట్స్ నిలిపివేశాయి. డిస్ని కూడా ఈ ఏడాది పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతుంది. మరికొన్ని కంపెనీలు ఇదే బాటలో నడుస్తాయన్న అంచనాలు ఉద్యోగుల్ని ఆందోళనకు గురిచేస్తోంది.
ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటే తిరిగి గాడిలో పెట్టడం తలకు మించిన భారం. ఆర్థిక మాంద్యం సాధారణంగా 3-4 ఏళ్లు కొనసాగుతుంది. దీంతో ఓ దేశ జీడీపీ 10% కుంగుబాటుకు లోనవుతుంది. మాంద్యం నిరుద్యోగం, పేదరికాన్ని సృష్టిస్తుంది. ఇదంతా ఒక ప్రాంతానికో, ఒక నగరానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండటం ఖాయం.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి