AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ. వెయ్యి పరీక్ష ఫీజును రూ. వందకు తగ్గిస్తూ నిర్ణయం.

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ఇంటర్‌ బోర్డ్‌ శుభవార్త తెలిపింది. ఇంటర్మీడియట్‌ లేట్‌ ఫీజును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీతో దాదాపు తెలంగాణలో దాదాపు లక్షన్నర మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. నిజానికి ఇంటర్మీడియట్‌ పరీక్షల ఆలస్య రుసుము రూ. వెయ్యిగా ఉంది. కానీ అధికారులు దీనిని..

TS Inter: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ. వెయ్యి పరీక్ష ఫీజును రూ. వందకు తగ్గిస్తూ నిర్ణయం.
AP Inter Exam
Narender Vaitla
|

Updated on: Jan 07, 2023 | 3:32 PM

Share

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ఇంటర్‌ బోర్డ్‌ శుభవార్త తెలిపింది. ఇంటర్మీడియట్‌ లేట్‌ ఫీజును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీతో దాదాపు తెలంగాణలో దాదాపు లక్షన్నర మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. నిజానికి ఇంటర్మీడియట్‌ పరీక్షల ఆలస్య రుసుము రూ. వెయ్యిగా ఉంది. కానీ అధికారులు దీనిని రూ. వందకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్‌ బోర్డ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇంతకీ రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఫీజులు ఆలస్యంగా చెల్లించడానికి అసలు కారణం ఏంటంటే. రాష్ట్రంలో 346 కళాశాలకు అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ నుంచి మినహాయింపు ఇవ్వడంలో జరిగిన జాప్యంతో విద్యార్థులు లేట్‌ ఫీజు చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎంపీ అసదుద్దీన్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను కోరినట్లు సమాచారం. దీంతో ఈ విషయంపై స్పందించిన మంత్రి సబిత కూడా ఫీజును తగ్గించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ క్రమంలోనే సదరు కళాశాలల్లోని విద్యార్థులకు పరీక్షల ఆలస్య ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.వందకు తగ్గిస్తున్నట్లు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ శుక్రవారం ఓ ప్రకటన జారీ చేశారు. విద్యార్థులు ఈ నెల 7, 8 తేదీల్లో పరీక్ష ఫీజులు చెల్లించాలి. మిగిలిన కళాశాలల్లోని విద్యార్థులు గతంలో ప్రకటించిన మేరకే పరీక్ష ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!
కేదార్నాథ్‌లో అద్భుతం.. స్కేటింగ్‌ చేస్తూ బయల్దేరిన భక్తుడు..
కేదార్నాథ్‌లో అద్భుతం.. స్కేటింగ్‌ చేస్తూ బయల్దేరిన భక్తుడు..
ప్రేమ పేరుతో వేధింపులు.. అరగుండు కొట్టించిన గ్రామస్తులు
ప్రేమ పేరుతో వేధింపులు.. అరగుండు కొట్టించిన గ్రామస్తులు