Andhra Pradesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ముందుగానే ప్రాక్టికల్స్ పరీక్షలు.. త్వరలోనే కొత్త షెడ్యూల్
థియరీ ఎగ్జామ్స్ కంటే ముందే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలోనే ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ రానుంది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అలెరర్ట్.. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మారనుంది. ప్రస్తుతం థియరీ పరీక్షలు పూర్తయ్యాక ప్రాక్టికల్స్ ఉండగా వీటిని ముందుగానే నిర్వహించాలని ఇంటర్మీడియెట్ విద్యామండలి భావిస్తోంది. ఏప్రిల్15 నుంచి మే10 వరకు రెండు విడతలుగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. అయితే మే వరకు ప్రాక్టికల్స్ ఉండడంతో ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని కళశాలల యాజమాన్యాలు ఇంటర్ విద్యామండలికి విజ్ఞప్తులు పంపించాయి. ఈ నేపథ్యంలో థియరీ ఎగ్జామ్స్ కంటే ముందే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలోనే ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ రానుంది.
కాగా ఏపీలో మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, మార్చి 16 నుంచి సెకండియర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3న ముగియనుండగా.. సెకండియర్ ఎగ్జామ్స్ ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 4న ముగియనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంకా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ ను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. అలాగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరపనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి..