Anganwadi jobs: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. వైఎస్సార్‌ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వైఎస్సార్‌ జిల్లాలోని వివిధ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు..

Anganwadi jobs: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Anganwadi Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 07, 2023 | 6:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. వైఎస్సార్‌ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వైఎస్సార్‌ జిల్లాలోని వివిధ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 148 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అంగన్వాడీ వర్కర్‌ (37), అంగన్వాడీ హెల్పర్‌ (108), అంగన్వాడీ మిని వర్కర్‌ (03) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు 10వ తరగతి, అంగన్‌వాడీ హెల్పర్, అంగన్‌వాడీ మినీ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడో తరగతి పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-07-2023 నాటికి 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తలను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 11-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* ఇంటర్వ్యూలను సంబంధిత డీఆర్‌డీవో కార్యాలయాల్లో 12-01-2023 తేదీన నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..