TS Inter Supply Exams 2023: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ టైం టేబుల్-2023 విడుదల.. ఫీ చెల్లింపులకు రేపే ఆఖరు

|

May 18, 2023 | 9:15 PM

తెలంగాణ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు గడువును మే 19వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ ఓ ప్రకటనలో తెలిపారు..

TS Inter Supply Exams 2023: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ టైం టేబుల్-2023 విడుదల.. ఫీ చెల్లింపులకు రేపే ఆఖరు
TS Inter Supply Exams 2023
Follow us on

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు మే 9న విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 9.06 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల్లో ఫస్ట్‌ ఇయర్‌లో మొత్తం 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్‌ ఇయర్‌లో 67.26  శాతం మంది పాస్‌ అయ్యారు. ఇక ఇంటర్మీడియట్ జవాబుపత్రాల పునఃలెక్కింపు, పునఃపరిశీలనకు దరఖాస్తు గడువు 17తో ముగిసింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు గడువును మే 19వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ టైం టేబుల్-2023

  • జూన్ 12- ల్యాంగ్వేజ్‌ పేపర్ 1
  • జూన్ 13- ఇంగ్లిష్‌
  • జూన్ 14- మ్యాథ్స్‌ 1A, బోటనీ, పొలిటికల్ సైన్స్‌
  • జూన్ 15- మ్యాథ్స్‌ 1B, జువాలజీ, హిస్టరీ
  • మ్యాథ్స్‌ 16- ఫిజిక్స్, ఎకనామిక్స్‌
  • మ్యాథ్స్‌ 17- కెమిస్ట్రీ, కామర్స్‌
  • మ్యాథ్స్‌ 19- పబ్లిక్‌ అడ్మినస్ట్రేషన్‌, బ్రిడ్జ్‌ కోర్స్ మ్యాథ్స్‌ (బైపీసీ)
  • మ్యాథ్స్‌ 20- మోడ్రన్ ల్యాంగ్వేజ్, జాగ్రఫీ

సెకండియర్‌ సప్లిమెంటరీ షెడ్యూల్-2023

  • జూన్ 12- ల్యాంగ్వేజ్‌ పేపర్ 2
  • జూన్ 13- ఇంగ్లిష్‌-2
  • జూన్ 14- మ్యాథ్స్‌ 2A, బోటనీ, పొలిటికల్ సైన్స్‌
  • జూన్ 15- మ్యాథ్స్‌ 2B, జువాలజీ, హిస్టరీ
  • మ్యాథ్స్‌ 16- ఫిజిక్స్, ఎకనామిక్స్‌
  • మ్యాథ్స్‌ 17- కెమిస్ట్రీ, కామర్స్‌
  • మ్యాథ్స్‌ 19- పబ్లిక్‌ అడ్మినస్ట్రేషన్‌, బ్రిడ్జ్‌ కోర్స్ మ్యాథ్స్‌ (బైపీసీ)
  • మ్యాథ్స్‌ 20- మోడ్రన్ ల్యాంగ్వేజ్, జాగ్రఫీ

ఎథిక్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ పేపర్లు జూన్ 21, 22 తేదీల్లో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.