TGPSC Group 1: తెలంగాణ గ్రూప్-1 పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..

|

Jul 07, 2024 | 1:24 PM

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 1:50 రేషియో ప్రకారం మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు మొత్తం 31వేల 382 మంది క్వాలిఫై అయినట్టు ప్రకటించారు అధికారులు. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జాబితా, కటాఫ్ మార్కుల వివరాలు ఉంచారు.

TGPSC Group 1: తెలంగాణ గ్రూప్-1 పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
Telangana Group 1 Prelims
Follow us on

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 1:50 రేషియో ప్రకారం మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు మొత్తం 31వేల 382 మంది క్వాలిఫై అయినట్టు ప్రకటించారు అధికారులు. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జాబితా, కటాఫ్ మార్కుల వివరాలు ఉంచారు. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఉంటుందన్నారు. 563 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నియామకాలు చేపట్టింది తెలంగాణ సర్కార్. గ్రూప్-1 మెయిన్స్‌కు వారం రోజుల ముందు హాల్ టికెట్స్ జారీ చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

 

కాగా టీజీపీఎస్సీ మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ 9న ఉదయం నిర్వహించింది.  అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి. అయితే మెయిన్స్‌ పరీక్షకు మల్టీజోన్‌ 1, 2 వారీగా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని తొలి నుంచి అభ్యర్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రతి మల్టీజోన్‌లో ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 1:50 నిష్పత్తిలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తేల్చి చెప్పడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.