Disabled People Job Portal: ‘దివ్యాంగులకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌.. ఇకపై నేరుగా ఉద్యోగాలు’ మంత్రి సీతక్క

మంత్రి సీతక్క దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్‌ ద్వారా దివ్యాంగ అభ్యర్ధులు దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది..

Disabled People Job Portal: 'దివ్యాంగులకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌.. ఇకపై నేరుగా ఉద్యోగాలు' మంత్రి సీతక్క
Disabled People Job Portal
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 15, 2024 | 4:47 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15: తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్‌ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సోమవారం ప్రారంభించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పది మందికి మహిళా సంక్షేమ శాఖలో నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. వికలాంగులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇతర అభ్యర్థులతో పోటీ పడాలంటే వారు మరింత పోరాడాల్సి ఉంటుందని అన్నారు. వైకల్యం మన చేతుల్లో లేదు. పోషకాహార లోపం వ్యక్తులను వికలాంగులను చేస్తుంది. అలాంటి వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రైవేటు ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రైవేటు ఉద్యోగాల కోసం దివ్యాంగ అభ్యర్ధులు ఆయా సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకునేలా జాబ్‌పోర్టల్‌ను అందుబాటులో తెచ్చామన్నారు.

ప్రైవేట్ యాజమాన్యాలు కూడా వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆమె అన్నారు. ఇకపై దివ్యాంగులు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌లో నేరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ పోర్టల్‌ ద్వారా వారు తమ అర్హతలను బట్టి ఉద్యోగావకాశాలు పొందవచ్చు. సంక్షేమ నిధుల నుంచి వికలాంగులకు ఐదు శాతం నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, రేవంత్ రెసర్కార్ ఒక శాతం రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచిందన్నారు.

ఇందిరమ్మ గృహాల వంటి సంక్షేమ పథకాల్లో కూడా ప్రభుత్వం దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తుందని, ఈ ఏడాది బడ్జెట్‌లో వికలాంగులకు ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని సీతక్క తెలిపారు.పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వికలాంగుల స్వయం ఉపాధికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్‌ శైలజ, దివ్యాంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ముత్తినేని వీరయ్యతో కలిసి జాబ్‌పోర్టల్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!