Telangana Govt Jobs: ‘వచ్చే 90 రోజుల్లో 30 వేల కొలువులు భర్తీ చేస్తాం.. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారంగానే ఉద్యోగాలు’ సీఎం రేవంత్‌

|

Jul 27, 2024 | 4:36 PM

తమ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ అనుగుణంగానే ఉద్యోగ నియామకాలు చేబడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 31వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని రేవంత్‌రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులతోపాటు గ్రూప్‌-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లోని పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సంవత్సరం తిరిగే..

Telangana Govt Jobs: వచ్చే 90 రోజుల్లో 30 వేల కొలువులు భర్తీ చేస్తాం.. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారంగానే ఉద్యోగాలు సీఎం రేవంత్‌
CM Revanth Reddy
Follow us on

హైదరాబాద్‌, జులై 27: తమ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ అనుగుణంగానే ఉద్యోగ నియామకాలు చేబడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 31వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని రేవంత్‌రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులతోపాటు గ్రూప్‌-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లోని పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సంవత్సరం తిరిగే సరికల్లా 60 వేలకు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించబోతున్నామని ఆయన వివరించారు. ప్రతి ఉద్యోగాన్ని జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగానే భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌ అన్నారు.

రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని తెలంగాణ స్టేట్‌ ఫైర్‌ సర్వీసెస్, సివిల్‌ డిఫెన్స్‌ శిక్షణ సంస్థలో శుక్రవారం ఫైర్‌మెన్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌.. 157 మంది డ్రైవర్‌ ఆపరేటర్లకు కొత్తగా నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. యువత ఏ ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొన్నారో.. ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. గడిచిన పదేళ్లలో నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చీరాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చడం ఆరంభించింది. ఎల్బీ స్టేడియంలో ఒకేసారి 31వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు అందించాం. వారిలో 483 మంది ఫైర్‌మెన్‌ కూడా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్తున్నారని అన్నారు.

అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తూ ప్రభుత్వంపై విశ్వాసం కల్పించామని అన్నారు. నిరుద్యోగ యువత నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు. మంత్రులందరూ అందుబాటులో ఉన్నారనీ.. నిరుద్యోగులు తమ సమ్యలను వారికి విజ్ఞప్తి చేయాలని కోరారు. అవి సహేతుకమైనవైతే తప్పకుండా పరిష్కరిస్తామని, మీ రేవంత్‌ అన్నగా మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తానని సీఎం రేవంత్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.