తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ వేగంగా వెనువెంటనే ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే గ్రూప్-1 ప్రకటన జారీ చేసిన కమిషన్.. కేవలం ఎనిమిది నెలల్లోనే 22 ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది. నెలకు సగటున మూడు ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఈ నెలలోనే దాదాపుగా 11 ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. ఈ లెక్కన మొత్తం 21,637 ఉద్యోగాల భర్తీ కి టీఎస్‌పీఎస్సీ ప్రకటనలు జారీ చేసింది. డిసెంబరు 30వ తేదీ వరకు 17,457 పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ అయ్యాయి.
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో అప్పగించిన మొత్తం పోస్టుల్లో దాదాపు 80.68 శాతం పోస్టులకు ప్రకటనలు వెలువడ్డాయి. అత్యధికంగా గ్రూప్-4లో 9,168 పోస్టులు జారీ చేసింది. ఇవేకాకుండా మరో 4 వేల పోస్టులకు సంబంధించి ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదలవ్వాల్సి ఉంది. వీటికి కూడా త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేయాలని కమిషన్ భావిస్తోంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.